డిసెంబర్‌లో పాక్‌-భారత్‌ క్రికెట్‌ దోస్తానా

ముంబయి, జూలై 16 (జనంసాక్షి): క్రికెట్‌ క్రీడాభిమానులకు ఒక శుభవార్త! భారత్‌-పాక్‌ జట్లు ఆడే మ్యాచ్‌లను తిలకించే మహద్భాగ్యం అభిమానులకు మరికొద్ది నెలల్లో కలగనున్నది. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు డిసెంబర్‌లో భారత్‌లో పర్యటించనున్నది. బిసిసిఐ అంగీకరిం చడంతో ఆ జట్టు భారతదేశ గడ్డపైకి వచ్చి ఆడనున్నది. అయితే భారత ప్రభుత్వ అనుమతితీసుకోవాల్సి ఉందని బిసిసిఐ ఆ జట్టుకు స్పష్టం చేసింది. భారత్‌తో మూడు వన్డేలు ఆడేందుకు పాక్‌ జట్టు ముందుకొచ్చింది. ఇదిలా ఉండగా భారత్‌-పాక్‌ మధ్య 2007లో ఆడిన సిరీస్‌ ఆఖరిది. ముంబయి దాడుల నేపథ్యంలో భారత్‌-పాక్‌ క్రికెట్‌ బంధం తెగిన విషయం క్రికెట్‌ అభిమానులకు తెలిసిందే. అయిదేళ్ల విరామం అనంతరం జరగనున్న క్రికెట్‌ మ్యాచ్‌కు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం బిసిసిఐ ఎదురు చూస్తోంది.