డీజీపీని కలిసిన హెడ్‌ కానిస్టేబుల్‌ శర్మ

హైదరాబాద్‌: పోలీస్‌ ట్రాస్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌ కమాండెంట్‌ లక్ష్మీనారాయణను అపహరించి నిన్న రాత్రి కలకలం సృష్టించిన హెడ్‌ కానిస్టేబుల్‌ గిరిప్రసాద్‌ శర్మ ఈ రోజు డీజీపీ దినేశ్‌ రెడ్డిని కలిశారు. విధులనుంచి సస్పెండైన తాను కేవలం ఉద్యోగం కోసమే క్రమశిక్షణారహితంగా వ్యవహరించానని తెలియజేశారు. డీజీపీ దినేశ్‌రెడ్డి తనకు తండ్రిలాంటివారని చెప్పుకొచ్చాడు.తనపై కేసులు పెట్టబోమని డీజీపీ స్వయంగా హామీ ఇచ్చినందుకే ఈ విషయంపై ఆయనకు పూర్తి వివరణ ఇచ్చేందుకు వచ్చినట్లు శర్మ తెలియజేశాడు.