డెంగ్యూ నివారణకు ఏర్పాట్లు చేశాం: మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 10: డెంగ్యూపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష జరిపారు. డెంగ్యూ ప్రబలకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఏజెన్సీలో కూడా డెంగ్యూ, మలేరియా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో డెంగ్యూ నిర్ధారణకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.