డ్రైనేజీ పనులు ప్రారంభించిన సర్పంచ్

నాగిరెడ్డిపేట 28 సెప్టెంబర్ జనం సాక్షి :-ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ సహకారంతో ఎస్డిఎఫ్ ద్వారా 10 లక్షల నిధులతో మండలంలోని అచ్చయ్యపల్లి గ్రామంలో నూతన డ్రైనేజీ పనులను గ్రామ సర్పంచ్ కొంపల్లి శైలజ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్కు సర్పంచ్ సూచించారు.అలాగే ధర్మారెడ్డి,కన్నా రెడ్డి గ్రామాల్లో డ్రైనేజీ పనుల నాణ్యత లోపాలను క్యూసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు కొంపల్లి శైలజ,బిట్లమురళి,శ్రీధర్ గౌడ్,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.