ఢిల్లీకి సమాచారం అందించిన సీబీఐ

హైదారాబాద్‌, మే 27 : అక్రమాస్తుల కేసులో జగన్‌ను అదుపులోకి తీసుకోనున్నట్లు సీబీఐ అధికారులు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించినట్టు సమాచారం. దీంతో ఏ క్షణమైనా అరెస్టు జరగవచ్చనే ప్రచారం ఊపందుకున్నది. ఇ పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను దిల్‌కుషా వద్ద మోహరించడం, రెడ్‌ అలర్ట్‌ ప్రకటించడం, జగన్‌ నివాసం, జడ్జీల నివాసాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. అంతేకాకుండా సెలవుల్లో ఉన్న పోలీసులను అత్యవసరంగా విధుల్లో చేరాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు.