ఢిల్లీలో మళ్ళీ అదే సీన్… కదిలే బస్సులో గ్యాంగ్ రేప్

ఢిల్లీ జనంసాక్షి
కదిలే బస్సులో కామాంధులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎ పార్టీలు గద్దెనెక్కినా తమకేంటంటూ సంఘవిద్రోహక శక్తులు తమ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నాయి. దారి తప్పిన ఓ యువతిపై బస్సు డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవరు దారుణానికి ఒడిగట్టారు. ఢిల్లీ నగర శివార్లలో బస్సును తిప్పుతూ యువతిపై గ్యాంగ్ రేప్ కు తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ బస్సులో వివాహిత యువతి ఒకరు బయలుదేరారు. శనివారం రాత్రి బాధితురాలు దాద్రి వెళ్లేందుకు కనౌజ్ దగ్గర బస్సు ఎక్కింది. అయితే గమ్యస్థానం చేరినా ఆమె గుర్తించకపోవడంతో ఢిల్లీ చేరారు. బాధితురాలిని దాద్రిలో దించుతామని బస్సు డ్రైవర్, అతని సహాయకుడు నమ్మబలికి వెనక్కు బస్సు తిప్పారు.
అయితే ఆమెను దాద్రికి తీసుకెళ్లకుండా నగర శివార్లలోనే బస్సు తిప్పుతూ ఒకరి తరువాత ఒకరు ఆమెపై దారుణానికి తెగబడ్డారు. చివరకు నగర శివార్లలోనే ఓ ప్రాంతంలో వదిలేశారు. తనపై దారుణానికి పాల్పిడినట్టు బాధితురాలి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. నిందితులు పరారీలో ఉన్నారు.
అ