ఢిల్లీ అత్యాచార బాధితురాలికి అమెరికా పురస్కారం

వాషింగ్టన్‌: ఢిల్లీలో దుండగుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన 23 ఏళ్ల వైద్య విద్యార్థినిని అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ధీర వనిత అవార్డుకు ఎంపిక చేసింది. మార్చి 8న ఈ అవార్డును బాధితురాలి కుటుంబసభ్యులకు అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా, విదేశాంగా శాఖ మంత్రి జాన్‌ కెర్రీ అందించనున్నారు. అత్యాచార ఘటన అనంతరం బాధితురాలు కొన వూపిరితో కొట్టుమిట్టాడుతూ కూడా రెండు సార్లు
పోలీసులకు ధైర్యంగా వాంగ్మూలాన్ని ఇచ్చిందని..న్యాయం కోసం చివరి వరకూ పోరాడి ఎందరో మహిళలకు ఆదర్శంగా
నిలిచిందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. మహిళల ధీరత్వానికి , సాధికారతకు గుర్తుగా ఈ అవార్డును 2007 నుంచి అమెరికా ప్రభుత్వం ఇవ్వడం ప్రారంభించింది. ఇప్పటి వరకూ 45 దేశాలకు చెందిన 67 మంది మహిళలకు అవార్డులను అందజేసింది.