ఢిల్లీ కీచక ఘటనలో మరొకరి అరెస్టు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటనలో మరో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుని వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ కేసులో బస్సు డ్రైవర్‌తో పాటు అతని సోదరుడు మరో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మరోవైపు బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సఫ్దార్జంగ్ ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు.