ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చెరుకున్న సీఎం

హైదరాబాద్‌: రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఢిల్లీలో ఆయన పార్టీలో పలువురు సీనియర్‌ నేతలతోనూ, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీతోనూ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌తోనూ, పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు.