ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతి నిధులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు హస్తిన పర్యటన చేపట్టిన నేపథ్యంలో తమ వాణిని బలంగా వినిపించేందుకు తాము కూడా ఢిల్లీ వెళ్లాలని నేతలు నిన్న నిర్ణయించారు. మంత్రి ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు కేఎల్ఆర్, ప్రతాప్‌రెడ్డి, అబ్రహమ్, కవిత తదితరులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరివెళ్లారు. ఈ పర్యటనలో పలువురు కాంగ్రెస్ పెద్దలను కలిసి డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలని కోరనున్నట్లు మంత్రి ప్రసాద్‌కుమార్ తెలియజేశారు.