ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి ప్రణబ్‌

తిరుపతి: భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుమల పర్యటన ముగించుకుని ఈ రోజు మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నిన్న రాత్రి తిరుపతి చేరుకున్న రాష్ట్రపతి పద్మావతి అతిధిగృహంలో బసచేశారు. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం, తిరుమలలో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రేణిగుంట  విమానాశ్రయం  నుంచి ఢిల్లీ బయలుదేరిన రాష్ట్ర పతికి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు వీడ్కోలు పలికారు.