ఢిల్లీ వీఐపీ జోన్‌లో అన్నా టీం హల్‌చల్‌

ప్రధాని నివాసం ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత
క్రెజీవాల్‌ అరెస్ట్‌, విడుదల
న్యూఢిల్లీ, ఆగస్టు 26 (జనంసాక్షి):
సామాజిక కార్యకర్త అన్నాహజారే బృందం సభ్యుడు కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుస్టేషన్‌ వద్ద ఆందోళన పెరగడంతో ఆయన్ను, ఆయనతో పాటు మరో ముగ్గుర్ని విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే.. బొగ్గు స్కాంకు నిరసనగా కేజ్రీవాల్‌ బృందం ఆదివారం ఉదయం ప్రధాని నివాసం వద్ద ధర్నా నిర్వహించేందుకు పూనుకుంది. విఐపి జోన్‌లోకి అనుమతి లేకుండా వచ్చినందుకుగాను కేజ్రీవాల్‌తో సహా మరో ముగ్గుర్ని అరెస్టు చేసిన పోలీసులు వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు కేజ్రీవాల్‌కు, ఆ ముగ్గురికి అనుకూలంగా నినాదాలు చేస్తూ నిరసన తెలపడంతో వారిని
ఇది అన్యాయం.. అక్రమం : కేజ్రీవాల్‌
బొగ్గుస్కాంలో కాంగ్రెస్‌, బిజెపి కుమ్మక్కయ్యాయని కేజ్రీవాల్‌ ఆరోపించారు. బొగ్గు స్కాంపై నిగ్గు తేల్చాలంటూ నాలుగు రోజులుగా ఉభయ సభల్లో సభ్యులు గొంతెత్తి అరుస్తున్నా.. ఆ దిశగా స్పందించకుండా సభలను పదే పదే వాయిదా వేస్తూ ఆ విషయాన్ని దాటవేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బిజెపి సహకరిస్తోందని ఆరోపించారు. లక్షలాది రూపాయల మేర ప్రజా సంపద దోపిడీకి గురైతే ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్ష సభ్యులు విఫలమయ్యారన్నారు. తాము శాంతియుతంగా ధర్నా చేపడితే అరెస్టు చేసి తమ నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ రెండు పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని, అందుకనే ప్రజలకు స్వచ్ఛమైన రాజకీయం అందించేందుకు అన్నాహజారే నేతృత్వంలో పార్టీ వస్తోందని చెప్పారు.