తండ్రిని భవనంపైనుంచి తోసేసిన తనయుడు

గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలి రాజీవ్‌ గృహకల్ప కాలనీలో మద్యం మత్తులో తండ్రిని భవనంపైనుంచి తోసేసిన తనయుడు. తండ్రి బాలేసాహెబ్‌ను కొడుకు మౌలాలీ మూడో అంతస్థునుంచి కిందకు తేసేశాడు. మద్యం మత్తులో ఉన్న మౌలాలీ పెళ్లి చేయలేదన్న కోపంతో తండ్రిని తోసేయగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.