తమిళనాడుకు కావేరి జలాల విడుదల
బెంగుళూరు : సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రానికి కావేరీ నది జలాలలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయడం ప్రారంభించింది. గురువారం రాత్రి నుంచి కృష్ణ రాజసాగర్ 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రానికి రోజుకు పదివేల క్యూసెక్కుల కావేరి నీటిని విడుదల చేయాలని కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.