తమిళనాడుకు కావేరీ నుంచి నీటి విడుదల నిలిపేస్తాం: కర్ణాటక సీఎం

ఢిల్లీ: ఈరోజు అర్ధరాత్రి నుంచి తమిళనాడుకు కావేరీ నుంచి నీటి విడుదలను నిలిపి వేస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ ప్రకటించారు. సెప్టెంబరు 19న కావేరీ రివర్‌ అథారిటీ నిర్ణయం మేరకు సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 15 వరకు కావేరి నుంచి తమిళనాడుకు రోజూ 9 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సివుంది.