తల్లీబిడ్డ ఆత్మహత్య

నెల్లూరు, జూలై 29 : కారణాలు తెలియరాలేదు కాని.. కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామం వద్ద రైల్వే ట్రాక్‌పై 25 సంవత్సరాల యువతి తన మూడు నెలల పాపతో ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని శనివారం రాత్రి పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతం పెద్దగా జనసమ్మర్ధం లేని ప్రాంతం కావడం వల్ల వెంటనే వెలుగులోకి రాలేదని పోలీసులు చెబుతున్నారు. పశువుల కాపరులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.