తహసీల్ధార్ నివాసాల్లో ఏసీబీ సోదాలు
కర్నూలు: కల్లూరు మాజీ తహసీల్దార్ అంజనాదేవి నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. కర్నూలు, గుంటూరు జిల్లాలోని ఆమె నివాసాలపై ఆదివారం ఉదయం అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆమె డ్రైవర్ ఇంటిలో కూడా తనిఖీలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలు రావడంతో అంజనాదేవిని ఇటీవల కల్లూరు నుంచి బదిలీ చేశారు. ప్రస్తుతం ఆమె వీఆర్‌లో ఉన్నారు.