తాగునీటి కోసం వెళ్లి విద్యార్థులకు కరెంట్ షాక్
చిత్తూరు: తాగునీటి కోసం వెళ్లిన పాఠశాల విద్యార్థులు కరెంట్‌షాక్‌కు గురయిన సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కొంగారెడ్డిపల్లి పురపాలక పాఠశాల విద్యార్థులు కొందరు తాగునీటి కోసం వెళ్లగా అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ షాక్‌కొట్టి 20మంది గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.