తాత్కాలిక ప్రయోజనాలు పొందేందుకే అనేక పథకాలు

హైదరాబాద్‌: తాత్కాలిక ప్రయోజనం పొందేందుకే ప్రభుత్వాలు ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయని వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఇచ్చినన్ని తాయిలాలు మరెవరు ఇవ్వలేదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ అన్నారు. ఇప్పుడు దేశంలో అంతా ఇదే విధానాన్ని అమలు పరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కులం,మతం, ఉచితం మంత్రాలను అంతా ఉపయోగిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే ఇవ్వన్ని తాత్కాలికమూనని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.