తిరుపతి జూలో విషాదం

` సింహం దాడిలో వ్యక్తి మృతి
తిరుపతి(జనంసాక్షి): తిరుపతి జూ పార్క్‌లో దారుణం జరిగింది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి హతమార్చింది. దాడి చేసిన సింహాన్ని జంతుప్రదర్శనశాల అధికారులు బోన్‌లో బంధించారు.మద్యం మత్తులో ఆ వ్యక్తి లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లినట్టు విచారణలో తేలింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్‌ గుర్జార్‌ (38)గా గుర్తించారు.