తిరుమల చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్ధం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమితులైన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తిరుమల చేరుకున్నారు. ప్రధాన న్యాయమూర్తికి తితిదే అధికారులు ఘనస్వాగతం పలికారు.ఆయన సాయంత్రం స్వామివారిని దర్శించుకుంటారు. రాత్రి తిరుమలలోనేే బసచేసి రేపు ఉదయం మరోమారు శ్రీవారి సేవలో పాల్గొని మధ్యాహ్నం తిరుగు ప్రయాణం కానున్నారు.