తివారీ డీఎన్‌ఏ రిపోర్టును వెల్లడించనున్న ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: పితృత్వ కేసులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ ఎన్‌.డి తివారీకి ఢీల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తన డీఎన్‌ఏ నివేదికను రహస్యంగా ఉంచాలని వేసిస పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. డీఎన్‌ఏ రిపోర్టును రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.ఈ నివేదికను కోర్టు మధ్యాహ్నం 2.30కు బహిర్గతపరుచనుంది. ఎన్‌డీ తివారీ తన తండ్రి అంటూ రోహిత్‌ శేఖర్‌ అనే వ్యక్తి ఢిల్లీ కోర్టును అశ్రయించడంతో తివారి రక్త నమూనాలను సేకరించాలని కోర్టు అదేశించిన విషయం తెలిసిందే.