తీరానికి కొట్టుకువచ్చిన విద్యార్థి మృతదేహం

విశాక: విశాక రుషికొండ బీచ్‌లో శుక్రవారం సాయంత్రం గల్లంతయిన హైదరాబాద్‌ నల్సార్‌ యూనివర్శిటీ తేజ్‌కుమార్‌ మృతదేహం శనివారం మధ్యాహ్నం తీరానికి కొట్టుకువచ్చింది. మృతదేహాన్ని స్వస్థలమైన అనంతపురం జిల్లా రాయదుర్గానికి తరలించారు. స్థానిక పీఎం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.