తుంగభద్రకు జలకళ

హోస్పేట,: తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి వదర నీరు వచ్చి చేరుతోంది. గత వారం టి.బిడ్యాంలో ఇన్‌ఫ్లో మైనన్‌ స్థాయిలో ఉండేది. దాదాపు జలాశయం అడుగంటింది. కేవలం 4టీఎంసీల నీటినిల్వ ఉండేది. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా ఎగువన వర్షాలు ప్రారంభం కావటంతో తుంగభద్ర జలాశయానికి రెండు అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 5.042టీఏంసీల నీటినిల్వ ఉంది. గత సంవత్సరం ఇదే సమయానికి జలాశయంలో 1608అడుగులు (32.724టీఎంసీ)ల నిల్వ ఉండేది. ప్రస్తుతం తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో వర్షాలు బాగానే పడుతున్నాయి. మరో మూడ్నాలుగు రోజుల్లో పెద్దఎత్తున వరద నీరు వచ్చే అవకాశం ఉంది.