తునికాకు తరలిస్తున్న లారీ దగ్ధం

మంథనిరూరల్‌ మే24 (జనంసాక్షి):
మండలంలోని నాగేపల్లి గ్రామం నుండి గురువారం తునికాకు బస్తాలతో లోడు నింపుకొని మంచిర్యాలకు వెళ్తున్న ఎపీ 16డబ్లూ 9969 నెంబరుగల లారీ మంథనిలోని కొత్త పెట్రోల్‌ పంపు సమీపంలో విద్యుత్‌ తీగలు తగలి పెద్ద మంటలు రావడతో డైవర్‌ సంపత్‌ చాకచాక్యంగా దూకడంతో అతను ప్రాణాపాయం నుండి బయట పడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వేరే గ్రామంలో మంటలార్పడానికి వెళ్లడంతో సకాలంలో రాకపోడంతో లారీ మంటల్లో కాలి బూడిదైంది.