తెదేపా ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ ముట్టడి

వరంగల్‌:విద్యుత్‌ కోతలపై జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అప్రకటిత కోతలకు నిరసనగా సోమవారం ఉదయం తెదేపా ఆధ్వర్యంలో రేగొండ విద్యుత్‌ ఉప కేంద్రాన్ని రైతులు ముట్టడించారు. వ్యవసాయానికి ఏడుగంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ ఇవ్వాలంటూ ధర్నా చేపట్టారు. అధికారులు హామి ఇచ్చేంతవరకు ఆందోళన  విరమించేది లేదని స్పష్టం చేశారు.