తెదేపా, కాంగ్రెస్‌ కుమ్మక్యయ్యాయి. ఈటెల రాజేందర్‌

మెదక్‌: ఎఫ్‌డీఐల అంశంపై రాజ్యసభలో ఓటింగ్‌  సమయంలో తెదేపా, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్యయ్యాయని తెరాస నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన మెదక్‌లో తెలియజేశారు. తెలంగాణ ప్రజలను మోసగిస్తున్న తెదేపా, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.