తెరాస ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అక్రమమం,వెంటనే విడుదల చేయాలి-కోదండరాం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధలో సీఎండీ కార్యాలయంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఇద్దరు తెరాస ఎమ్మెల్యేలను పోలిసులు అరెస్టు చేశారు. విద్యుత్‌ సౌధ వద్ద తెరాస ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అక్రమమని, వారిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాజకీయ ఐకాస కన్వీనర్‌ కోదండరాం అన్నారు.