తెరాస మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నరసింహారావు
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్29(జనంసాక్షి)
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల తెలంగాణ రాష్ట్ర సమితి మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గద్దపాటి నరసింహారావును నియమిస్తూ ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. నరసింహ రావు తనను నమ్మి ఎమ్మెల్యే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పార్టీ ప్రతిష్టను కాపాడుతానని తెలుపుతూ తన పదవికి సహకరించిన గార్ల మండల తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్, పార్టీ నాయకులకుప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువతను కలుపుకొని పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలలోకి తీసుకువెళ్ళి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని నరసింహ రావు అన్నారు.
Attachments area