తెలంగాణపై ఎటూ తేల్చని బాబు

హైదరాబాద్‌: కొండంత రాగం తీసి అర్థం కాని పాట పడినట్లు తెలంగాణ అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాసినా మళ్లీ అందులో మడత పేచి పెట్టాడు. వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అందులో తమ వైఖరి వెల్లడిస్తామని తెలుగు తమ్ముల్లను నిరాశలో ముంచారు. ఇప్పటికే తము గతంలో ఒక సారి లేఖ రాశామని చెప్పి కాంగ్రెస్‌ కన్నా రెండు ఆకులు ఎక్కువే చదువుకున్నానని రుజువు చేసుకున్నాడు.