తెలంగాణపై తీర్మానం పెట్టాలని ప్రధానికి బాబు లేఖ

హైదరాబాద్‌: తెలంగాణపై తీర్మానం పెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ అంశంపై తాము గతంలోనే కేంద్రానికి లేఖ ఇచ్చామని ఆ లేఖను ఇప్పటికీ వెనక్కుతీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యను కేంద్రం జటిలం చేసిందని బాబు ఆరోపించారు. 2004 ఎన్నికల్లో తెరాసతో పొత్తు పెట్టుకొని మోసం చేసింది కాంగ్రెస్సేనని ఆయన ఆరోపించారు. 2014 ఎన్నికలకు కాంగ్రెస్‌, తెరాస, వైకాపాలు కలిసి నాటకం ఆడుతున్నాయని బాబు తన లేఖలో విమర్శించారు.