తెలంగాణపై నాన్చుడు ధోరణికి స్వస్తి చెప్పాలి: ప్రభాకర్‌ రెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన విషయంలో కేంద్ర ప్రభుత్వంనాన్చుడు ధోరణికి ఇకనైనా స్వస్తి చెప్పాలని హోంశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌  సీనియర్‌ నేత కె. ప్రభాకర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భాజపాతో పాటు పలు జాతీయ పార్టీల మద్దతుందన్నారు. గత ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని పోందుపరిచి అధికారం చేపట్టి. ఏళ్లు గడిచినా నేటికీ తేల్చకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.