తెలంగాణపై ప్రకటన చేయాలి : విద్యాసాగరరావు

హైదరాబాద్‌: జీవవైవిధ్య సదస్సుకు తెలంగాణ ఉద్యమన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్సిస్తోందని భాజపా ఆరోపించింది. ప్రధాని జోక్యం చేసుకుని తెలంగాణ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ కేంద్ర సహాయమంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌ రావు డిమాండ్‌ చేశారు. సోమవారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నాయకులు చింతా సాంబమూర్తి, దాసరి మల్లేశంతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 30న జరిగే తెలంగాణ కవాతును అడ్డుకునేందుకు చిన్నచిన్న కారణాలతో ఇప్పట్నుంచే తెలంగాణవాదుల్ని అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ మార్చ్‌ను భాజపా పాల్గొంటుందన్నారు.