తెలంగాణపై ముందు కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకోవాలి:కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌:తెలంగాణపై ముందు కాంగ్రెస్‌ తరువాత కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 1969,71 ఉద్యమాల సమయాల్లో తెలంగాణపై కేంద్రం స్పష్టత ఇచ్చిందని ఇప్పుడూ కూడా ఇస్తుందని అయనన్నారు.  గ్యాస్‌ సిలిండర్ల సంఖ్య పెంపు ప్రతిపాదనపై కేంద్రంతో చిర్చస్తామని ఆయన పేర్కొన్నారు. ఎవరిప్రాంత అభిప్రాయాలను వారు చెప్పడంలో తప్పులేదని అయనన్నారు.