తెలంగాణలో ఈనెల 14న ఎంసెట్

హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 14న ఎంసెట్ నిర్వహిస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్‌ రమణారావు తెలిపారు. ఈమేరకు తెలంగాణ ఎంసెట్‌-2015 విధివిధానాలను రమణారావు వెల్లడించారు. ఈ నెల 14న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఇంజనీరింగ్‌ పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి 5 :30 వరకు మెడికల్‌ ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షలకు 30 నిమిషాల ముందు అభ్యర్థులు హాజరుకావాలని రమణారావు సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు, వాచ్‌లు తీసుకురావొద్దని వెల్లడించారు. 16న పరీక్షల కీని విడుదల చేస్తామని చెప్పారు. 24న ఎంసెట్‌ ఫలితాలను వెల్లడించనున్నారు. ఇంజనీరింగ్‌ పరీక్షకు 1.32 లక్షల మంది అభ్యర్థులు హాజరవ్వనున్నారని… 252 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మెడికల్‌ పరీక్ష రాసే 70 వేల మంది అభ్యర్థులకు 172 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.