తెలంగాణలో కొనసాగుతున్న బంద్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర విధానానికి నిరసనగా తెరాస ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో బంద్‌ జరుగుతోంది. తెలంగాణలోని పదిజిల్లాలో బస్సుల  రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు మూతపడ్డాయి. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలంటూ పలు ప్రాంతాల్లో తెరసా శ్రేణులు ఆందోళన నిర్వహించాయి