తెలంగాణలో జయ శంకర్‌సార్‌ వర్థంతి సభ

 

కరీంనగర్‌: తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ కళ సాకారం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి జయశంకర్‌సార్‌ మొదటి వర్థంతి సభను తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు కరీంనగర్‌ మదీనా సెంటర్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె సార్‌ పేరిట ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లడుతూ.. జయశంకర్‌సార్‌ ఆశయాలను కొనసాగిద్దామని, తెలంగాణ కళ సాకారం అయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని ఆమె చెప్పారు. తెలంగాణ కోసం నిరంతరం పరితపించిన తెలంగాణ వాది జయ శంకర్‌సార్‌ అని అన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌ లింగంపల్లిలో కూడా పలువురు తెలంగాణ వాదులు సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.