తెలంగాణలో పంటనష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను అదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందపి తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ విమర్శించారు. ఏడాదిన్నర కిందిట అందాల్సిన పరిహారం రైతులకు ఇప్పటికీ ఇవ్వలేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఎమిటో తెలుస్తోందని తెలంగాణ భవన్‌లో  మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణలో పంటనష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. పంటల భీమా లోపభూయిష్టంగా ఉందని క్షేత్రస్థాయిలో అధికారులు రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు.