తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ..సీఎం రేవంత్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ

` సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్‌ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై చర్చ
హైదరాబాద్‌(జనంసాక్షి): సీఎం రేవంత్‌రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ ఇప్పటికే నోటీసులు పంపించారు.తాజా సీఎం రేవంత్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీలో సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్‌ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.