తెలంగాణ అంశంపై సోనియాకు లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై ఈ నెల 28లోపు నిర్ణయం వెలవరిస్తుస్తారన్న నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే రాష్ట్రంలో తలెత్తే పరిణామాలను లేఖలో పేర్కొన్నారు. నిన్న పార్టీ సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లో సమావేశమై రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసిన విషయం తెలిసిందే.