తెలంగాణ అనుకూల పార్టీలను ధర్నాకు ఆహ్వానిస్తాం : నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణకు మద్దతుగా ఈ నెల 19న ఇందిరాపార్కు వద్ద సీపీఐ చేపట్టనున్న సామూహిక ధర్నా పోస్టర్లను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆవిష్కరించారు. భాజపా, వైకాపా మినహా తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీలను ధర్నాకు ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్రం అనుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉద్థృతం చేస్తామని హెచ్చరించారు.