తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

తెగిన కవాను నరాన్ని కుంచెగా మల్చుకున్న చిత్రకారుడు

చరిత్ర మనుషులను నమోదు చేస్తుంది.ప్రతి భావంతులుగాను, కళాకారులుగానూ చివరికి చరి త్రకారులుగానూ…నమెదైనదంతా నిఖార్సయిన చర్రితేమి కాదు. ఎందుకంటే అనామక ప్రతిభా వంతులెందరో, కళాకారులెందరో, చరిత్రకారు లెందరో, చరిత్రకారులెందరో, చూపు కంటని చీక టిలో ఒక మూలగా… (ప్చ్‌ …పిచ్చివాళ్ళు.దీన్ని త మ సింప్లిసిటి అనుకుంటారు)కళ్లుండీ లేనట్టు నటి స్తారు..ఎప్పటికీ పై నుంచి చూసే ప్రయత్నమే. అందుకే వాళ్ల నటన నడ్డి విరగొట్టాలి. అందుకే కొన్ని నిజాలు చెప్పాలి.ఆ ప్రయత్నమే ఈ ‘ ములా ఖాత్‌ ‘అతుడు బాపనోళ్ళు పిలగాడు కాకపోవచ్చు.

అతడు వారసత్తపు కళామర్మాలు సొకని వాడు కావచ్చు.ఏమో అతడు అక్బరే కావచ్చు. బొమ్మ తో ని  కవిత్వం బతికేది నిజమైతే దానికి అక్బర్‌ సాక్షి. బొమ్మలో కూడా జీవకళ ఉట్టిపడుతుంటే దీనికి అక్బర్‌ జిమ్మెదారి!

ఖమ్మం జిల్లా పాల్వంచ అక్బర్‌ పుట్టిన ఊరు. హుస్సేన్‌బీ, మున్వరుద్దీన్‌ అమ్మీ అబ్బాలు. ముత్యా లమ్మపాడులో 10వ తరగతి,పాల్వంచలో ఇంటర్‌, సత్తుపల్లిలో డిగ్రీ (బి.ఎస్సీ).డ్రాయింగ్‌ లోయర్‌, హైయ్యర్‌ పాసై టీచర్‌ ట్రైనింగ్‌ చేశాడు.7వ తరగతినుంచే బొమ్మలు వేయడంమీద ఇష్టం ఉన్న అక్బర్‌ డిగ్రీ చదువుతూ సత్తుపల్లిలో సైన్‌ బోర్డు ఆరిస్టు దగ్గర పని చేశాడు.డిగ్రీ చదువుతూ అబ్బా యి గొడలెక్కి బొర్డులకి కలర్‌ కోటింగ్‌ చేస్తుం డడం చూస్తే క్లాస్‌మేట్స్‌ చిన్నచూపు చూస్తారని పించినా ఫీల్‌ అయ్యేవాడు కాదు.డిగ్రీ అయిపో యాక ఎమ్మోస్సిలో బిఇడీనో చేయ్చాలనే దారిలో తోటోళ్లంతా వెళ్తుంటే తను మాత్రం బిఎఫ్‌ఏ చెయ్యాలనే తపనతో అక్కడే ఆగాడు.పి.జి.కి వెళ్లక బిఎఫ్‌ఏ అంటూ మళ్లీ డిగ్రీనే చేస్తావా అంటూ అంతా ఎగతాళి చేసున్న ఎంతో కష్టంతో హైద్రా బాద్‌ వచ్చి బిఎఫ్‌ఏ ఎంట్రెన్స్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ రాశా డు.సీటొస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూశాడు. రాలేదు ఆ ఏడాది వృదా అయి పోయింది.అట్లా మూడుసార్లు.మూడేళ్లు..! అప్పటికి తనకు ఈ సీ టు రాదన్న విషయం,ఎందుకు రావడం లేదనే విషయమూ అర్దమై నిరాశపడపోయాడు. ఈ మూడేళ్ల కాలమూ తన పెయింటర్‌ దోస్తు కృష్ణతో కలిసి పాల్వంచలో పెయింటింగ్‌ చేస్తూపోయాడు. నాలుగో ఏడాది ఆంధ్రా యూనివర్సిటీలో బిఎఫ్‌ఏ ఎంట్రెన్స్‌లో అవ్బర్‌కు ఫస్టు ర్యాంకు వచ్చింది. కాని అదే సమయంలో అక్బర్‌ అబ్బాజాన్‌ గుండ ెపోటుతో చనిపోయారు. దాంతో బిఎఫ్‌ఏలో చేర లేకపోయిన అక్బర్‌ ఖమ్మంలో హెల్త్‌ ఇన్స్‌పెక్టర్‌ ట్రైనింగ్‌ చేశాడు. ఉద్యోగానికి అంచం ఇవ్వలేక తిరిగి పాల్వంచ వచ్చేసి మళ్లీ పెయింటింగ్‌ చేసు కుంటూ పోయాడు. బాబ్రీ మజీదు కూల్చివేత సందర్భం అక్బర్‌లో ఒక కదలికను తెచ్చింది. దాంతోపాటు సాహిత్యం మీద మొదట్నుంచి ఉన్న ఆసక్తి, సాహితీమిత్రులతో పరిచయాలు ఆఖరికి ఆర్టిస్టుగా అతన్ని హైద్రాబాద్‌ చేర్చాయి. ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ఆర్టి స్టుగా చేరి మూడున్నర ఏళ్లు కుంచె కదలికల్లోని తన ప్రత్యేకతను ఆంధ్రప్రదేశ్‌కి పరిచయం చేశాడు.

అక్బర్‌ కవి కూడా అక్బర్‌లోని కవి, చిత్రకారుడు కలిసి అతన్ని ప్రశాంతంగా ఉండని వ్వక, అప్పటికి ఉన్న పద్దతుల్లోనే బొమ్మలు గీయ డాన్ని కూడా అంగీకరించక అతన్ని అతలాకు తలం చెయ్యడం కథలకు, కవితలకు ఒక కొత్త కోణంలోంచి బొమ్మలు వేసేలా తపన పెరగడం.. వెరసి అక్బర్‌ బొమ్మలు ఒక కొత్త శైలిని పత్రికల్లో ప్రవేశపెట్టాయి. అప్పటికి పత్రికల్లో వస్తున్న బొ మ్మలు కథల్లోని పాత్రల్ని ఏమాత్రం పోలి ఉండక పోవడం, అసలు ఆ బొమ్మలకు, కథల్లో చిత్రించ బడుతున్న జీవితాలకు పొంతన కుదరకపోవడం అక్బర్‌ని అశాంతికి గురిచేశాయి. బొమ్మ లేయడ మంటే కథలోని ఏదో ఒక సన్ని వేశాన్ని ప్రతిఫ లింపజేయడం కూడా అక్బర్‌కి సరైందనిపించ లేదు. దంతో రచయితల, కవుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ తనూ అదనంగా కొన్ని కొత్త ఇమేజ్‌ని, సిమిలీస్‌ని, మెటాఫర్‌సని తన బొమ్మల ద్వారా ప్రతిఫలింప చేస్తూపోయాడు. దాంతో కొం దరు చిత్రకారులు, సాహితిమిత్రులు ఇవేం బొమ్మ లులాంటి విమర్శలు చేయడం, నిరుత్సాహపర్య డం లాంటివి జరిగినా తనేం వెనక్కి తగ్గక చివరికి తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నాడు.

తెలంగాణలోని దళితుల, ముస్లింల జీవితాలు దగ్గ ర్నించి చూస్తూ వస్తున అక్బర్‌ తన బొమ్మల్లో వాటి ని ప్రతిఫలింపజేస్తూ వస్తున్నాడు. దళిత ముస్లిం వాదాల నేపథ్యం తన కుండడంతో ఆయా వాదా ల కొత్త ఒరవడుల్ని తన బొమ్మల్లోకి ఒంపాడు. తెలుగు సాహిత్యంలో కొన్నేళ్లుగా వస్తున్న సంకల నాల ముఖచిత్రాల్లోనూ అక్బర్‌ తనదైన శైలిని ప్రవేశపెట్టాడు.

చేతులెత్తి పోరాడుతున్నట్లు లేని పోరాటాల్ని బొమ్మలుగా వెయ్యడం అక్బర్కఇ ఇష్టముండదు. ప్రజల ఫీలింగ్స్‌లోనే వాళ్ల కోపమో, అసహనమూ, పోరాటమూ కన్పించేలా బొమ్మలేయడం, వాళ్ల జీవితాల్ని యాధాతథంగాచిత్రించడం ద్యారానే వాళ్ల పోరాటాల్ని ఉద్దేశాల్ని, వాస్తవ స్థితిని తెల పడం తన కిష్టమంటాడు. ఏక్రిలిక్‌ కలర్స్‌తో కా న్వాస్‌ మీద బొమ్మలెయ్యడం తన కిష్టం కాని అది ఖరీదైన పని కాబట్టి పేపర్లమీదనే వేస్తూ పోతున్నా డు. కాని ఏక్రిలిక్‌ కలర్స్‌తో  కాన్వాస్‌మీదికి ఇంత దాకా ఎక్కని బుతకుల్ని ఎక్కించాలనేది తన లక్ష్యం..ఫిగరేటివ్‌ డిస్టార్షన్‌ పద్దతిలో బొమ్మలే స్తున్న అక్బర్‌ వాస్తవ విరుద్దమైన బొమ్మలు వేయ డం తన కిష్టంలేదన్నాడు. ఒక్కో ప్రాంతానికి సం బంధించి ఒక్కో రీతిగా బొమ్మలుంటాయి. ముస్లిం లు, దళితులు, బహునులు, తెలంగాణ ప్రాంత సంస్కృతి, భాష, జీవన విధానంతో పాటు, భౌగో ళిక, ఆర్థిక పరిస్థితుల్నిబట్టి శరీర నిర్మాణాల్లో తేడా ఉంటుంది. తెలంగాణ ప్రాంతపు ప్రజల్లో అది స్పష్టంగా కనిపిస్తుంటుంది. దాన్ని నా బొమ్మల్లో ప్రతిఫలింపజేసే ప్రయత్నం చేస్తున్నాను.

బాబ్రీ మజీద్‌ను కూల్చివేసినపుడు అప్పటికి నేనే చవిచూడని చిత్రవిచిత్ర సంఘటనల్ని ఎదు ర్కొన్నాను. అక్కడ్నించి నేనొక ముస్లింనన్న స్పృహ నాలో కదలిక తెచ్చింది. అప్పట్నించి ముస్లింల దీ న హీన జీవితాల్ని కూడా చిత్రించాల్సిన బాధ్యత నాపై ఉందన్న ఆలోచన నాలో జనించింది. అం దుకే ముస్లింల జీవితాల్ని కూడా చిత్రిస్తూ వస్తు న్నాను. అంటున్నాడు అక్బర్‌. బ్లాక్‌ & వైట్‌, మట్టి రంగుని ఇష్టపడుతూ ఆ రంగుల్లోనే బొమ్మలు గీసే అక్డర్‌ గ్లోబలైజేషన్‌ ప్రభావంతో వ్యక్తులు పోతుం డడం, సంస్కృతులు, జీవన విధానాలు కనుమరు గయ్యే ప్రమాదం ఉండడంతో వాటిని రికార్డ్‌ చే య్యాలనే సంకల్పంతో ఉన్నానని అంటున్నారు.  ఇప్పటికి ఆంధ్రజ్యోతిలో బొమ్మలేస్తూ, స్త్రీ, దళిత, ముస్లిం, బహుజన, తెలంగాణ, దూదేకుల వాదా ల ప్రముఖ సంకలనా లెన్నింటికో బొమ్మలేస్తూ వస్తున్న అక్బర్‌ ఇవాళ తెలంగాణ, ఆంధ్ర చిత్ర కళా రంగంలో మినార్‌ కొసలా మెరుస్తున్న కొత్త వెలుగు రేఖ…

అతనితో ములాఖాత్‌లోని మరికొన్ని సవాల్‌ జవాబ్‌లు…బాపు గీతను ‘ఆంధ్ర చిత్రకళ’దాట లేదంటున్నారు. శ్రీశ్రీని దాటి తెలుగు కవిత్వం ముందుకు వెళ్లలేదు అన్నట్లుగా ఉంది ఈ వాదన. ప్రతిభకు పీఠం వేయాల్సిందేగాని మిగతావాళ్లకు కూచునే చోటు కూడా లేకుంటే ఎట్లా? బాపు గీత ను ఆంధ్ర చిత్రకళ దాటలేదనడం వట్టిమాట. ఎపి దాటితే బాపు ఎవరో ఎవరికీ తెలియదు. బాపు క న్నుఒకపార్వ్శంనుంచేసమాజాన్ని చూడగలిగింది. అతని కుంచె పరిధి తక్కువ. ఎపుడూ బాపు అగ్ర కులాల సంస్కృతి..వాళ్ల ఇళ్లల్లో పిల్ల లూ..వాళ్ల ఆ టలు..తప్పించి ‘మోహన్‌’ అన్నట్టు ఎప్పుడూ మట  లో చొక్కా లేకుండా వున్న పిల్లాడ్నో తాటిముంజల బండిని లాక్కెళ్లే చిక్కుజుట్టు అమ్మా యినో.. డక్కలి..మంగలి..మాదిగ..ముస్లిం..పిల్లలనో గీయలేదు..

-వేముల ఎల్లయ్య, స్కైబాబ

ఇంకావుంది…