తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

మనరాష్ట్రం మరో గుజరాత్‌ కాకుండా చూసుకో గలమా!?

తి ఆదివాసీలు హిందువులు కారు, వారికి వారి సొంత సంస్కృతి సాంప్రదాయాలున్నాయి. పండు గలు, దేవతలు ఉన్నారు. ఆరెస్సెస్‌, విహెచ్‌పి వా రిని హిందువులుగా మార్చడానికి దశాబ్దకాలంగా పనిచేస్తున్నాయా. అమాయక ఆదివాసీలను హిం దూత్వంలోకి లాగి వారితో హత్యలు చేయడానికి ఉపయోగించుకున్నారు. ఇంతకుముందు జరిగిన మత ఘర్షణల్లో ఆవాసీలు పాల్గొనలేదు. అసలు మత ఘర్షణలు అనేవి ఆదరెస్సెస్‌, విహెఎచ్‌పి ద్వారానేతెలిసింది -చంపక్‌, కో-ఆర్డినేటర్‌, ‘సార్తి’

తి ‘ప్రతి మత ఘర్షణలోనూ బాదితులు ముస్లిం లు లేదా దళితులే. ఈ ఘర్షణల్లో ఒక్క హ్మ్రణుడు గానీ ఒక్క పటేల్‌గానీ, ఒక్క ఠాకూర్‌గానీ చనిపోలే దు. చనిపోయిన వాళ్లందరూ ముస్లింలు లేదా దళి తులు. సంజయ్‌ పరమార్‌ అనే నా మిత్రుడిని ఆరె స్సెస్‌ గూండాలు పట్టుకోని ముస్లింలపై దాడి చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఒకవేళ తను చనిపోతే తన ఇంట్లో 2 లక్షల రూపాయాలు ఇస్తామని చె ప్పారు.సంజయ్‌ పరమార్‌ దళితుడు ఇలాగే ప్రతి దళితుడిని వారు ముస్లింలపై దాడులకు ఉపయో గించారు. ముస్లింలపై దాడులు చేస్తే కేసులుండ వని, పైగా దోచుకున్నది అంతా దోచుకున్నవారికే చెందుతుందనిబాగప్రచారంచేశారు’ -యూ సూఫ్‌ మన్సూర్‌, షా-ఆలం క్యాంపు, ‘అమన్‌ సముదా య్‌’ సభ్యుడు. ఇందులో పని చేస్తున్న 800 ల మంది కార్యకర్తలంతా ముస్లింలు లేదా దళితులు, ఒక్కరు కూడా అగ్రకూలానికి చెందినవారు లేరు.

తి ‘ముస్లింలు మిమ్మల్ని చంపేందుకు వస్తు న్నారు కాబటీ మీ ప్రాణాలు దక్కాలంటే మీరే ము స్లింలను ఎదిరించండి అని దాహోద్‌ జిల్లాలోని రందిక్‌పూర్‌ తాలుకా డి.ఎస్‌.పి చుట్టుపక్కల ఉన్న ఆదివాసీ గూడేల్లో సంజేలి, సీతాకోస్లి, లిమిడి, ముకోస్లి, పిమి, వసియ, ఫతేపూర్‌, సుఖ్‌సర్‌, మోతిబాండిబార్‌, లింఖేడా, పిప్లోరద్‌, బారియా ప్రాంతాల్లోపోలీసులేఇలాంటివిషప్రచారం చేశారు. ఆదివాసీలను రెచ్చగోట్టారు’- సాదిఖ్‌, సంజీలి.

తి తుమారా స్టేట్‌మే నక్సల్‌వాది హైనా,ఉన్‌కో ఇదర్‌ బిజావో, వోతో హమారి రక్షా కరేంగే.. -అబ్దుల్‌ హక్‌, పంచమహల్‌ జిల్లావాసి.

మన రాష్ట్రంలోలాగా దళిత ఉరద్యమంగానీ, నక్సలైట్‌ ఉద్యమంగానీ, మహుజ సమాజ్‌ పార్టీ గానీ, ఇతర ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు, హక్కుల సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలుగానీ, కమ్యూనిస్టు పార్టీలుగానీ గుజరా త్‌లో లేవు.ర పైగా దశాబబ్దాల నుండి కూడా ఏ సంస్కరణ్యోద్యమందానీ, ఏ జ్రాస్వామిక ఉద్యమం గానీ జరగలేదు. చివరికి మన రాష్ట్రంలోలాగా బలమైన ప్రాంతీయ పార్టీ కూకడా లేదు. వీటి స్థానాన్నీ హిందూత్వ ఛాందసవాద మతోన్మాద సంస్థలు ఆక్రమించాయి. ఆరెస్సెస్‌, విహెచ్‌పి, శివసేన, భజరంగ్‌దళ్‌లే గాక మోగీశ్వర పరివార్‌, గాయత్రీ పరివార్‌, సద్విచార పరివార్‌, స్వామి నా రాయణ సంప్రదాయ్‌, ఇంకా హిందూ మహసభ, దాని అనుబంధమైన భారతీయమిలన్‌ మందిర్‌, ఆరెస్సేస్‌ స్థాపించిన సామాజిక్‌ సమ్‌రాష్ట్ర మంచ్‌ ఇలా లెక్కకు మించిన హిందూత్వ సంఘాలు దశా బ్దాల నుండి గుజరాత్‌లో చురుకుగా పని చేస్తు న్నాయి. భారతీయ మిలన్‌ మందిర్‌ హిందూ పం డుగలను విస్తృతంగా  జరిపేది. ఇందులో ఆదివా సులను భాగస్వాములను చేసేది. మాస్లింలు, క్రిస్టి యన్లు కాని వారందరూ హిందువేలేననే ప్రచారం చేస్తూ హిందువులు అందరూ ‘ ఆవు, రాముడు, వేదం, గీత, ఆచారి’ వీరిని నిత్యం పూజించాలని ప్రచారం నిర్వహించింది. వీళ్ల టార్గెట్‌ ఆదివా సులు కాగా, ఆరెస్సేస్‌ యోక్కసామాజిక్‌ సంరాష్ట్ర మంచ్‌’ దళితులను, అండేద్కరైట్‌లను బిజెపికి దగ్గ ర చేసింది. ఇట్లా హిందుత్వ వాదులకు మొదటి నుండి ఆదివాసులను, ధలితులను ఆకర్షించేం దుకు ప్రత్యేక కార్యక్రమం ఆంది. పకడ్భందీ వ్యూ హం వుంది. ఆదివాసులకోసం వనవాసీ కళ్యాణ ఆశ్రమ్‌ కూడా పని చేస్తున్నది. హిదుత్వవాదుల కార్యక్రహాలు అన్ని వూడ దళితుల, ఆదివాసుల ఏ ఇతర భౌతిక అవసరాలు తీర్చలేదు. వారిని హిందుత్వ గోతిలోకి లాగడమే వీది కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. కాగా రాజకీయంగా కూడా అక్క డ కాంగ్రెస్‌, బిజేపి తప్ప మరో రాజకీయ పార్టీ లేదు. ఆరెస్సెస్‌, విహెచ్‌పిలాంటి హిందూ సంస్థ లలో సభ్యులయిన వారే కాంగ్రెస్‌లో నాయకు లుగా ప్రజా ప్రతినిధులుగా చెలామణి అవుతున్నా రు.బిజేపి మొత్తం హిందుత్వవాదులకు రాజకీయ ప్రతినిధి కాగా కాంగ్రెస్‌లోని నాయకత్వం కూడా హిందూ నాయకత్వమే, బాబాల్టి గుజరాత్‌లో హిం దూత్వవాద రాజకీయాలకు ప్రత్యామ్నాయ రాజకీ యం లేదు. ఇక ముస్లింలకు ఏ రాజకీయ పార్టీ లేదు. అండా లేదు

గుజరాత్‌ లో 1980-90 ప్రాంతంలో టెక్స్‌ టైల్స్‌ పరిశ్రమలో వచ్చిన సంక్షోభంతో చాలా మిల్లులు మూతపడ్డాయి. ఒక లక్షమంది రోడ్డున పడ్డారు. ఇలాంటి నిరుద్యోగులు, బీదవాళ్లు, కటిక దరిద్రులు, తిండికి నోచుకోని పేదల్ని హిందూత్వ వాదులు వానరసైన్యంగా ఉపయోగించుకున్నారు. వారితో హత్యలు, లూటీలు, గృహ దహనాలు చేయించారు.గుజరాత్‌ లో హిందూ బనియాలపా టు బోహ్రా ముస్లింలు కూడా వడ్డీ వ్యాపారస్తులే. అల్లార్లు జరుగుతాయని ముందే తెలిసిన బనియా లు వడ్డీరేటు120 నుండి 80 శాతం తగ్గించారు. ఇదంతా తెలియని ముస్లిం వ్యాపారులపైకి దళితు లను ఆదివాసులను రెచ్చగొట్టడానికి అది బాగా ఉపయోగపడింది.ఇట్లా గుజరాత్‌ సామాజిక ఆ ర్థిక, రాజకీయ పరిస్థీతులు గమనించినట్లైతే అక్క డ ముస్లింల పై జరిగిన జాతి హత్యాకాండకు హిందుత్వవాదుల వద్ద దశాబ్దకాలం నుంచి పక డ్భందీగా ప్రణాళిక ఉందని అర్థమవుతుంది.దాన్ని ఎదుర్కోడానికి  కావాల్సిన ఉద్య మాలు అక్కడ లేవు.అంబడ్కరైట్లుగా చెప్పుకునేవాళ్లు కూడా అక్క డ బిజెపిలోనే ఉండడం మరింత విషాదకరం గుజరాత్‌ నరమేధం ఈ దేశ లౌకిక ,ప్రజాస్వా మిక వాదులకు,దళిత,కమ్యూనిస్టు ,నక్సలైట్‌ ఉద్య మాలకు అంతిమ హెచ్చరిక ,ఈ దేశ ముస్లింల ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత వీరందరి పైనా ఉంది.మన రాష్ట్రంలో ప్రధానంగా తెలం గాణలో హిందుత్వవాదం బలపడుతున్నది. నక్స లైట్‌ ఉద్యమం బలంగా ఉన్న కరీంనగర్‌, వరం గల్‌ ,మెదక్‌,హైదారాబాద్‌ల్లోనేహిందుత్వ బిజెపీ విజయం సాధించడం ప్రమాదకరమైన పరిణా మం,మన రాష్ట్రం మరో గుజరాత్‌ కాకుండా చూసుకోగలమా                                                                                  హిందుత్వంను ఎదుర్కోంటానికి సరైన ఆయుధం లేదు

లక్ష్యసాధన పద్ధతులు నిజంగా ఏమిటో మీకు తెలియకపోతే మీరు చేసే ప్రతి ప్రయత్నం అది ఎంత గట్టి ప్రయత్నమైనాసరే  నిష్ఫలమే అవుతుం ది.అంబేద్కర్‌ హిందూ మతోన్మాదాన్ని ఎదుర్కోవా లంటే ఈ దేశ సెక్యులరిస్టుల దగ్గర సరైన ఆయు ధం లేదు.అగ్రకుల తత్వం మతతత్వ రూపంలో ముంచుకోస్తుందని గ్రహించాక కూడా దాన్ని ఎదు ర్కోనే సాధనాల్లో దళిత బహుజన గిరిజన సంఘ టన అవసరాన్ని గుర్తించడం లేదు.ఇండియాలో కులం మతం వేరువేరు కాదు.వేదాలనించి మను స్మృతి వరకు ఎక్కడా మతం అనేభావన కనింపిం చదు.బ్రాహ్మణుల వ్యక్తిగత జీవన విధానం సాఫ ీగా సాగటం కోసం అనేక మంది మనుషులు ఏర్పాటుచేసిన సామాజిక చట్టాలు మత రూపాన్ని తీసుకున్నాయి.ప్రత్యేక బ్రాహ్మణ జీవన విధానం ఆత్మిక చింతన పేరుతో దేవుని నేరుతో హిందుమ తంగా మారింది.దానికి పునాదిగా బ్రాహ్మణుల వేదాలు,ఉపనిషత్తులు ,పురాణాలు , ఇతిహాసాలు నిలబడ్డాయి.ఫలితంగా బ్రాహాణీయ కుల దోపిరడి వేల సంవత్సరాలు కోనసాగుతున్నది.దీన్ని ప్రతిఘ టించాల్సిన శక్తులు కూడా దాని ప్రభావానికి లోన యి శక్తిహీనంగా మారుతున్నాయి.కుల మత సమ స్యలు సంఘ సంస్కరణలకు సంబందించిన అం శాలుగా భావించడం వల్ల ఉదార దృక్ఫథం ఏర్ప డుతుంది. కాని అవిసమాజానికి అందులో దళి తులకు ప్రమాదంగా పరిణమించాయి.అగ్ర కుల దోపిడికి నిరసనగా దళితులు పోరాడే సమయం లో మతాన్ని ప్రధాన వైరధ్యంగా ప్రజల ముందు పెట్టడం జరుగుతున్నది.కుల సమాజ శాశ్వతాక రణ కోసం అగ్రకులాలు ప్రారంభించిన సంఘ పరివార్‌ హిందుత్వవాదం వేలాది మందిని ఊచ కోత కోస్తున్నది.అత్యంత విషాదకర అంశం ఏమి టంటే దళితుల బీసిల శక్తిని సంఘపరివార్‌ గుర్తిం చినంతగా సెక్యులర్‌ శక్తులు గమనించకపోవటం పరివార్‌ దళితుల్ని చేసిదీసి ముస్లిం వ్యతిరేకత బోధిస్తున్నది. వారి సాధనంగా వాడుకుంటున్నది. బంగారు లక్ష్మణ్‌వంటి వారితో సామాజిక పునాది ని ఏర్పాటు చేసుకుంటుంది.ఏకోపాధ్యాయ పాఠ శాలల పేరుతో దళితులకు మతం విషం బోధిస్తు న్నది.విద్యామందిర్‌ లలో దళితుల్ని చేర్చుకుని మె దళ్లను కలుషితం చేస్తుంది.అల్లర్లలో మతతత్వం నెత్తికెక్కిన దళితులు ముస్లింలను నరికే తలారు లుగా మారుతున్నారు.సంఘపరివార్‌ స్పష్టమైన పథకంతో ముందుకు పోతున్నది.ఇది బహిరంగ రహస్యం ఈ సంగతి ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదులకు తెలుసు వారు చేసే ప్రతిపాదనలు హిందుత్వ శక్తులకు మేలు చేసేవిగా ఉంటున్నా యి.మేజారిటీ ,మైనారిటిలను ప్రత్యర్థులుగా నిలబ ెట్టేవిగా ఉంటున్నాయి.ముస్లింల పక్షాన హిందు  మతతత్వం అని అరవటం వల్ల సాదారణ వ్యక్తి హిందువుగా ఫీల్‌అయి పరివార్‌ ప్రచారం పట్ల సానుకూల స్పందనను కనబరుస్తున్నాడు. దోపిడి, కూలాలు చేసే మత పర ఘర్షణలను కులం కోణం నుంచి పరిశీలించడం వల్ల సరైన పోరాట రూపాన్ని రూపోందించగలం. అది దళితులు మాత్రమే పరిశీలించగలరు.

-వేముల ఎల్లయ్య,స్కైబాబ

ఇంకావుంది…