తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

 ‌ జనం సాక్షి, మంథని : మార్చి 12వ తేదీన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్వహించ తలపెట్టిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పోస్టర్ను ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం ముదిరాజ్ , సలహాదారు బురుగు శంకర్ గౌడ్ బత్తుల శంకర్ గొగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మంథనిలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల ఆత్మగౌరవ సదస్సు ఈనెల 12న సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో నిర్వహించడం జరుగుతుందని, ఈ సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో న్యాయవాదులు రగోతం రెడ్డి, డి.విజయ్ కుమార్, శ్రీహరి, జపతి రాజేశం, కట్కం శ్రీనివాస్, తీర్థాల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సంక్షేమ ఫలాల్లో 20 శాతం వాటా కేటాయించాలని, స్వతంత్ర సమరయోధులకు ఇచ్చినట్లుగా గుర్తింపు ఇవ్వాలని, స్వతంత్ర సమరయోధులకు ఇచ్చినట్లు బస్సుల్లో రైల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని, స్వతంత్ర సమరయోధులకు ఇచ్చినట్లు పెన్షన్ ఇవ్వాలని, ఉద్యమకారులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, ఉద్యమకారుల బందు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సందర్భంగా కోరారు.