‘తెలంగాణ ఉద్యోగులను ఇబ్బంది పెడితే ఖబడ్దార్‌’

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తే ఖబడ్దార్‌ అని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఉద్యోగులను అరెస్టు చేయడం ఆపకపోతే మరోసారి సమ్మెకు దిగుతామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణవాదులను హైదరాబాద్‌కు తరలించేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పది జిల్లాల్లో అరెస్టు చేసిన ఉద్యోగులను, తెలంగాణ వాదులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. మార్చ్‌లో తెలంగాణ వాదులు వేల సంఖ్యలో పాల్గొని సత్తా చాటాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.