తెలంగాణ ఎన్జీవో సంఘం భారీ ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాన రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంద్ర పాలకులు… ఈ ప్రాంత ఉద్యోగులకు కేటాయించిన భూములు దక్కకండా కుట్రపన్నుతున్నారని తెలంగాణ ఐకాస చైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. తెలంగాణ ఎన్జీవో హోసింగ్‌ సొసైటీ పరిరక్షణ కోసం తెలంగాణ ఎన్జీవో సంఘం హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. మొజాంజాహీ చౌరస్తా నుంచి నాంపల్లిలోని తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘ భవనం వరకు ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు అక్కడ బహిరంగ సమావేశాన్ని నిర్విహించారు. సొసైటీలో ఆక్రమాలు జరిగాయని జంఘ విద్రోహ శక్తులు చేస్తోన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ ర్యాలీ ఎంతో దోహదం చేస్తుందని కోదండరాం తెలిపారు.