తెలంగాణ కల సాకారం కాబోతోంది: కేసీఆర్‌

నల్గొండ: త్వరలోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారం కాబోతోందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ నేత కళ్లెం యాదగిరిరెడ్డి ప్రథమ వర్థంతి సభ సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగించారు. యాదగిరిరెడ్డి నిబద్ధత, క్రమశిక్షణతో 1969 నుంచి తెలంగాణ కోసం పోరాడుతూ వచ్చారని కొనియాడారు. అనుక్షణం తమ వెంట ఉండి ధైర్యాన్నిచ్చారని తెలియజేశారు. యాదగిరిరెడ్డి కుమారుడు వేణుగోపాల్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌లోకి కేసీఆర్‌ ఆహ్వానించారు. ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేయాలని వేణుగోపాల్‌రెడ్డికి కేసీఆర్‌ సూచించారు.