తెలంగాణ కవాతును అక్టోబరు 20వరకూ వాయిదా వేసుకుంటే మంచిది: సీఎం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డితో తెలంగాణ ప్రాంతానికి చెందిన 9మంది మంత్రులు ఈరోజు జూబ్లీహాలులో సమావేశమయ్యారు. ఈనెల 30న జరగనున్న తెలంగాన కవాతుపై వురు సీఎంతో చర్చించారు. తెలంగాణ కవాతును అక్టోబరు 20 వరకూ వాయిదా వేసుకుంటే మంచిదని ఈసందర్భంగా సీఎం మంత్రులతో అన్నారు. ఈమేరకు అన్ని రాజకీయపార్టీలను కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌ వద్ద వినాయక నిమజ్జనం జరుగుతుంగా తెలంగాణ కవాతుకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.