తెలంగాణ కవాతుపై కిషన్‌రెడ్డితో ఐకాస నేతల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాన్ని ఐకాస వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని భాజపా  కార్యాలయానికి వచ్చిన ఐకాస నేతలు కోదండరాం, స్వామిగౌడ, విఠల్‌ తదితరులు సాగరహారం మార్చ్‌కు కలిసి రావాలంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయలను కోరారు. మార్చ్‌ను విరమించుకోవాలని చెప్పేనైతిక హక్కు ప్రభుత్వానికి లేదని.. తెలంగాణ  ఇస్తున్నామని ప్రధాని స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప కవాతును ఆపబోమని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. కవాతుకు సహకరించాలంటూ మంత్రులకు , పోలీసు కమిషనర్‌ను లేఖలు రాస్తామని కోదండరాం తెలియజేశారు.