తెలంగాణ న్యాయవాదుల బైక్‌ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు సన్నాహక ర్యాలీగా ఇవాళ తెలంగాణ న్యాయవాదులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. నాంపల్లి కోర్టు నుంచి మియాపూర్‌ కోర్టు వరకు నిర్వహించిన ఈ ర్యాలీని తెలంగాణ రాజకీయ జేఏసీ  ఛైర్మన్‌ కోదండరాం ప్రారంభించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో తెలంగాణ న్యాయవాదులు పాల్గొన్నారు.